అందులో నిజం లేదు

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమాలో కన్నడ హీరో యష్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని ఈ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అందులో నిజం లేదంటున్నారు యష్. ఈ విషయం మీద యష్ క్లారిటీ ఇస్తూ ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించినట్టు మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. నేను ఆ సినిమాలో యాక్ట్ చేయడం లేదు. ఆ టీమ్ నన్ను సంప్రదించలేదు కూడా. అంత పెద్ద డైరెక్టర్ పేరుని అలా రూమర్స్‌కి వాడటం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ‘కేజీఎఫ్’ మీదే ఉంది’’ అని పేర్కొన్నారు. యష్ నటించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ‘కేజీయఫ్’ డిసెంబర్ 21న కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో త్వరలో లాహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ కానుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి