‘సైరా’తో పాటే చిరు, కొరటాల మూవీ..?

Will Chiranjeevi Works Simultaneously In Sye Raa And Koratala Siva Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ ‘సైరా’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ షెడ్యుల్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే మరో షెడ్యుల్‌ను ప్రారంభించబోతోందని చిత్రయూనిట్‌ తెలిపింది. అయితే చిరు తన తదుపరి చిత్రం గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. 

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ. ‘భరత్‌ అనే నేను’ లాంటి భారీ హిట్‌ తీసిన కొరటాల తన తరువాతి చిత్రం చిరుతో చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల చెప్పిన లైన్‌ చిరుకు నచ్చడంతో వెంటనే స్క్రిప్టును కూడా రెడీ చేయమన్నట్లు తెలుస్తోంది. కొరటాల అక్టోబర్‌ కల్లా పూర్తి స్థాయి స్క్రిప్టును సిద్దం చేసి షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే.. రానున్నకాలంలో చిరు..  సైరా సినిమా షూటింగ్‌తో పాటు కొరటాల మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంటారేమో.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top