ఓషో వెబ్‌ సిరీస్‌లో ఆమిర్‌ 

Will Aamir Khan play 'Osho' in web-series? Here's the truth - Sakshi

ప్రముఖ ఆధ్మాత్మిక గురువు రజనీశ్‌ (ఓషో) జీవితం ఆధారంగా ఓ  వెబ్‌ సిరీస్‌ రానుందని సమాచారమ్‌. ఓషోగా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో ఓషో బయోపిక్‌ని దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ తెరకెక్కించనున్నట్లు గతంలో వార్తలొచ్చినా ఆ ప్రాజెక్ట్‌  పట్టాలెక్కలేదు. తాజాగా ఓ అంతర్జాతీయ చానెల్‌ ఓషో జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కించనుందట. రచయిత శకున్‌ బత్రా కథ కూడా సిద్ధం చేస్తున్నారట.

ఓషోగా ఆమిర్‌ఖాన్‌ అయితే కరెక్ట్‌గా సరిపోతారని వెబ్‌ సిరీస్‌ బృందం ఆలోచనట. విలక్షణ పాత్రల్లో నటించేందుకు ఎప్పుడూ ముందుండే ఆమిర్‌ కూడా ఈ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని బీటౌన్‌ టాక్‌. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ కూడా ఈ వెబ్‌ సిరీస్‌లో మెరవనున్నారట. పూర్తి వివరాలు తెలియాలంటే కాసింత ఓపిక పట్టాలి మరి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top