పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

weight loss on hero nithin - Sakshi

వరుస సినిమాలను లైన్లో పెట్టి ఈ సారి మస్త్‌ ప్రీ ప్లాన్డ్‌గా ముందుకెళుతున్నారు హీరో నితిన్‌. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై కూడా ఫోకస్‌ పెట్టిన ఆయన రెండు నెలల్లో పన్నెండు కేజీల బరువు తగ్గారు. ‘‘కొన్ని నెలల క్రితం నా భుజానికి గాయమైంది. ఈ గాయం నుంచి కోలుకునేలోపే అనుకోకుండా నా చేయి కాలింది. ఇక ఆ సమయంలో చేసేది ఏమీ లేక బాగా విశ్రాంతి తీసుకున్నాను. ఫలితంగా బరువు పెరిగాను. దీంతో మళ్లీ వర్కౌట్స్‌పై దృష్టి పెట్టి రెండు నెలల్లో 12 కేజీల బరువు తగ్గాను. నా జిమ్‌ ట్రైనర్‌ వంశీకృష్ణకు థ్యాంక్స్‌’’ అని నితిన్‌ అన్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌ ఏలేటి, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి,కృష్ణ చైతన్య దర్శకత్వాల్లో తెరకెక్కనున్న సినిమాల్లో హీరోగా నటించనున్నారు నితిన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top