మరోసారి వార్తల్లో వరుణ్‌ సందేశ్‌ భార్య

మరోసారి వార్తల్లో వరుణ్‌ సందేశ్‌ భార్య


హైదరాబాద్‌ : హీరో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక షేరూ మరోసారి వార్తల్లో నిలిచారు. వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ఇటీవలే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లున్న ఫొటోలు కూడా సర్క్యులేట్‌ అవ్వడంతో.. అవన్నీ పుకార్లేనని వితిక వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.అయితే తాజాగా వితిక చేసిన ఓ మంచి పనికి నెటిజన్లు తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాను ఎంతగానో ఇష్టపడి పెంచుకొన్న జట్టును కొంతమేరకు క్యాన్సర్‌ బాధితులకు కోసం విరాళంగా ఇచ్చారు. ఆహారం, డబ్బులాంటివి విరాళంగా ఇవ్వడం సాధారణంగా చాలామంది ఇచ్చేవే. అయితే ఏళ్ల తరబడి ఇష్టంగా పెంచుకున్న జుట్టును ఇవ్వడం కొంత ఇబ్బందికరమే అని వితిక పేర్కొన్నారు. క్యాన్సర్‌ బాధితులను దృష్టిలో ఉంచుకొని,  సదుద్దేశంతో తల వెంట్రుకలను  క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అధ్యార్‌(చెన్నై)కు విరాళంగా ఇచ్చానని పేర్కొన్నారు. గతంలో రేణుదేశాయ్‌, ఛార్మీ కూడా జట్టును విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Back to Top