విష్ణు ఓటు ఎవరికి?

విష్ణు ఓటు ఎవరికి?


ఓటర్‌ అంటే ఎవరు? ఓటు హక్కు వచ్చినోళ్లు! 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ భారత ప్రభుత్వం ఓటు హక్కు కల్పించింది. ఈ లెక్కన మంచు విష్ణుకు ఎప్పుడో ఓటు హక్కు వచ్చింది. కానీ, ఇప్పుడాయన నొక్కి వక్కాణించి మరీ నేను ‘ఓటర్‌’ అంటున్నారు.


రీజన్‌ ఏంటంటే... మంచు విష్ణు హీరోగా జి.ఎస్‌. కార్తీక్‌ దర్శకత్వంలో రమారీల్స్‌ పతాకంపై సుధీర్‌కుమార్‌ పూదోట నిర్మిస్తున్న తెలుగు, తమిళ చిత్రానికి ‘ఓటర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. హీరో ఆఫ్‌ ది నేషన్‌... అనేది ఉపశీర్షిక. మోహన్‌బాబు బర్త్‌డే సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ టైటిల్‌ను ప్రకటించారు. మరి, ఇందులో విష్ణు ఎవరికి ఓటు వేశారో సినిమా చూసి తెలుసుకోవాలి. సురభి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: కిరణ్‌ తనమాల, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.

Back to Top