అభిమన్యుడు ఏం చేశాడు?

Vishal's Abhimanyudu Motion Poster  - Sakshi

మహాభారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని చేధించి, అందులోకి ఎలా వెళ్లాలో తెలుసు. కానీ, బయట పడడం తెలియదు. మరి, నయాభారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహం లోంచి బయటపడే కిటుకు తెలిసిందా? అసలు, అతడికి ఎలాంటి పద్మవ్యూహం ఎదురైంది? అనే విషయాలు తెలియాలంటే సంక్రాంతి వరకూ వెయిట్‌ చేయాలి. విశాల్‌ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సిన్మా ‘అభిమన్యుడు’. సమంత హీరోయిన్‌. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదివారం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసినవాటితో పోలిస్తే పూర్తి భిన్నమైన చిత్రమిది. దర్శకుడు పి.ఎస్‌. మిత్రన్‌ అద్భుతంగా తీస్తున్నారు. కంటెంట్, బడ్జెట్, టెక్నికల్‌ అంశాల పరంగా హై ఎండ్‌లో ఉంటుంది. ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌గారు డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. హీరోగా నేనెంతో ఇష్టపడి చేస్తున్న సినిమా. డిసెంబర్‌ 27న పాటల్ని, వచ్చే ఏడాది జనవరి 13న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, కెమెరా: జార్జి సి. విలియమ్స్, మాటలు: రాజేశ్‌ ఎ. మూర్తి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top