వైశాఖంలో కాదు... మైనస్‌ డిగ్రీస్‌ చలిలో డ్యాన్స్‌ చేశా!

వైశాఖంలో కాదు... మైనస్‌ డిగ్రీస్‌ చలిలో డ్యాన్స్‌ చేశా!


‘‘మోడ్రన్‌ డ్రెస్సుల్లోనే కాదు... చీరల్లోనూ అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే వల్గర్‌గా కాకుండా ఎంత అందంగా చూపిస్తారనేది కెమెరామెన్, దర్శకుల చేతుల్లో ఉంటుంది. గ్లామరస్‌ రోల్స్‌ చేయడానికి నేను రెడీ. అయితే వల్గర్‌గా ఉండే గ్లామర్‌ రోల్స్‌ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు హీరోయిన్‌ అవంతిక. హరీశ్‌ హీరోగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’లో ఆమే హీరోయిన్‌. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అవంతిక చెప్పిన విశేషాలు...⇒ నేను పుట్టింది ఢిల్లీలో. మా నాన్నగారు ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌. తరచూ ట్రాన్స్‌ఫర్లు కావడంతో ఇండియా మొత్తం తిరిగేశాం. బెంగళూరులోని కాలేజీలో చదువుకున్నాను. కాలేజ్‌ డేస్‌లో స్పోర్ట్స్‌ పర్సన్‌ లేదా పైలట్‌ అవ్వాలనుకున్నాను. నేను స్టేట్‌ లెవల్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ని. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే మనసు మార్చుకుని, హీరోయిన్‌గా ట్రై చేద్దామనుకున్నా.గతంలో నీలకంఠ డైరెక్షన్‌లో ‘మాయ’  సినిమా చేశాను. ‘వైశాఖం’ నా ఫస్ట్‌ కమర్షియల్‌ మూవీ.⇒ బీఏ రాజుగారు, జయ మేడమ్‌ నా ఫొటోలు చూసిన రోజే హారీశ్‌ కాంబినేషన్‌లో ఫొటోషూట్‌ చేసి కథ, వినిపించారు. కథ విన్నప్పుడు మంచి క్యారెక్టర్‌ చేయబోతున్నాననే ఫీల్‌ కలిగింది. నా రియల్‌ లైఫ్‌కి దగ్గరగా భానుమతి క్యారెక్టర్‌ ఉంటుంది. క్లైమాక్స్‌లోని ఎమోషనల్‌ సీన్‌లో నాకు ఐదు పేజీల డైలాగ్స్‌ ఉన్నాయి. కొంచెం కష్టమనిపించినా జయగారి ప్రోత్సాహంతో సీన్‌ కంప్లీట్‌ చేశాను. చిన్నప్పుడు కథక్‌ నేర్చుకున్నాను. కానీ ఫిల్మ్‌ డ్యాన్స్‌ కష్టం. కజకిస్థాన్‌లో మైనస్‌ 6 డిగ్రీస్‌లో సాంగ్‌ షూట్‌ చేశాం. అదో మంచి ఎక్స్‌పీరియన్స్‌. ఏడాదిగా ‘వైశాఖం’ జర్నీ సూపర్‌.  ⇒ నా డ్రీమ్‌ రోల్‌వారియర్‌ ప్రిన్సెస్‌. స్పోర్ట్స్‌ బ్యాగ్రౌండ్, మిలటరీ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న పాత్రలంటే ఆసక్తి ఉంది. తమిళంలో ‘నెంజమెల్లామ్‌ కాదల్‌’ అనే సినిమా చేస్తున్నా. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.

Back to Top