ఇటలీలో పెళ్లండీ... సెలవులు కావాలి!

Virat Kohli and Anushka Sharma are NOT getting married this December - Sakshi

పెళ్లెవరిది? హిందీ హీరోయిన్‌ అనుష్కా శర్మదే. ఎవరితో? ఇంకెవరు... మన టీమిండియా కెప్టెన్, క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లితోనే. ఎప్పుడు? డిసెంబర్‌లో! అవునా.. నిజమా.. మీకెలా తెలుసు? అనుకుంటున్నారా? డిసెంబర్‌లో శ్రీలంకతో టీమిండియా సిరీస్‌ ఉంది! ‘సారీ... శ్రీలంకతో సిరీస్‌ ఆడలేను. సెలవులు కావాలి’ అని విరాట్‌ ఇండియన్‌ క్రికెట్‌ బోర్డుకి లీవ్‌ లెటర్‌ పెట్టాడు. మాంచి ఫామ్‌లో ఉన్న క్రికెటర్‌ ఇలా సెలవులు అడిగితే ఎలా? అసలు ఎందుకీ సెలవులు? అని ఆరా తీయడం మొదలెట్టారు.

అనుష్కా శర్మ కూడా సేమ్‌ టైమ్‌లో... అంటే డిసెంబర్‌లో షూటింగులు పెట్టుకోకుండా పర్సనల్‌ లైఫ్‌ కోసం కాల్‌షీట్స్‌ కేటాయించారని తెలిసింది. మేటర్‌ ఏంటి? అని బీటౌన్‌లోనూ బాతాఖాని మొదలైంది. అప్పుడు బయటకొచ్చింది... ఈ ఇయర్‌ ఎండింగ్‌లో (డిసెంబర్‌లో) విరాట్‌–అనుష్కలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్త! అదీ ఇండియాలో కాదు. ఇటలీలోని మిలాన్‌ సిటీలో. ప్రభాస్‌ ‘మిర్చి’లో హీరో ఇంట్రడక్షన్‌ చూపిస్తారే... ఆ సిటీనే. వరల్డ్‌ ఫ్యాషన్‌ క్యాపిటల్‌గా మిలాన్‌కు మంచి పేరుంది. బయట ఎన్ని వార్తలు షికార్లు చేస్తున్నా, ఏం పట్టించుకోకుండా ఉండడం విరాట్‌–అనుష్కల స్టైల్‌. ఇప్పుడూ అంతే... పెళ్లి వార్తల గురించి ఏం మాట్లాడడం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top