ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!

Vijay Sethupathi Prices Trisha In 96 Movie Launch - Sakshi

తమిళసినిమా: సీనియర్‌ హీరోలను వర్ధమాన హీరోయిన్లు, ప్రముఖ హీరోయిన్లను యువ హీరోలు పొగడ్తలతో ముంచేయడం అన్నది సర్వసాధారణ విషయమే. నటుడు విజయ్‌సేతుపతి అందుకు అతీతం కాదు. ఈయన నానూ రౌడీదాన్‌ చిత్రం నుంచే ప్రముఖ హీరోయిన్లతో నటించడం మొదలెట్టారు. ఆ చిత్రంలో నటించేటప్పుడు నయనతార నటనను, ఆమెకున్న నటనపై అంకితభావాన్ని తెగ పొగిడేశారు. తాజాగా నటి త్రిషతో కలిసి 96 అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతార తరువాత ఆయనతో నటిస్తున్న ప్రముఖ కథానాయకి త్రిషనే. 96 చిత్రం ద్వారా నడువుల కొంచెం పక్కత్త కానోమ్‌ చిత్రం ఫేమ్‌ ఛాయాగ్రాహకుడు ప్రేమ్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, త్రిషల ప్రాతలు 16,36,96 కాల ఘట్టాలకు చెందినవిగా ఉంటాయట.

దీంతో ఈ జంట మూడు రకాల గెటప్స్‌లో నటిస్తున్నారు. 96 అనే టైటిలే భిన్నంగా ఉంటే, కథ, కథనాలు కూడా వైవిధ్యంగా ఉంటాయని దర్శకుడు అంటున్నారు. చెన్నై చిన్నది త్రిషతో నటిస్తున్న అనుభవం గురించి విజయ్‌సేతుపతి తెలుపుతూ నటనను ఎంతగానో ప్రేమించే నటి త్రిష అని పేర్కొన్నారు. ఎలాంటి పాత్రనైనా పూర్తిగా అర్థం చేసుకుని నటిస్తారని చెప్పారు. త్రిష నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. వృత్తిపై భక్తిభావం కలిగిన త్రిష ఒక్క రోజు కూడా షూటింగ్‌కు ఆలస్యంగా రాలేదన్నారు. అందరికంటే ముందుగా వచ్చి మేకప్‌తో షూటింగ్‌కు రెడీగా ఉంటారని తెలిపారు. వృత్తిపై అంత అంకిత భావం కలిగిన నటి కాబట్టే 15 ఏళ్లుగా కథానాయకిగా రాణించగలుగుతున్నారని కితాబిచ్చారు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top