ఆమిర్‌.. సేతుపతి.. ఓ మల్టీస్టారర్‌

Vijay Sethupathi confirms Aamir Khan collaboratio - Sakshi

ఆమిర్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. విజయ్‌ సేతుపతి.. తమిళంలో అప్‌కమింగ్‌ సూపర్‌ స్టార్‌. ఇద్దరూ అద్భుతమైన నటులు. పేపర్‌ మీద రాసుకున్న పాత్రకు స్క్రీన్‌ మీద ప్రాణం పోస్తుంటారు. ఈ ఇద్దరూ త్వరలోనే స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని విజయ్‌ సేతుపతి స్వయంగా తెలిపారు. ‘‘ఆమిర్‌ఖాన్‌గారు, నేను ఓ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఇద్దరి హీరోల అభిమానులు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top