వేసవికి వస్తున్నాం

vijay next new movie with lokesh kanaga rajan - Sakshi

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘బిగిల్‌’ సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నారు తమిళ హీరో విజయ్‌. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘మా నగరం’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ ఈ సినిమా నిర్మాణ భాగస్వామి. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించనున్నారు. సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రహకుడు. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌లో మొదలు కానుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. అజిత్‌ 60వ చిత్రం కూడా వచ్చే ఏడాది సమ్మర్‌లోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్‌.వినోద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top