నువ్వే నా అవార్డ్‌

Vignesh Shivn Congratulates Nayanthara In Cute Post - Sakshi

మన విజయాన్ని అభినందించేవాళ్లు ఆత్మీయులు. మన విజయాన్ని కూడా తమ విజయంగా భావించే వాళ్లు మనల్ని ప్రేమించేవాళ్లు. నయనతార సక్సెస్‌ను విఘ్నేష్‌ శివన్‌ అలానే ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘నాకు ఒక్క అవార్డ్‌ కూడా రాలేదు. కానీ నువ్వే నాకు దొరికిన బెస్ట్‌ అవార్డ్‌’ అని ప్రేయసి నయనతారను పొగడ్తలతో ముంచెత్తారు తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో నయనతార ‘బెస్ట్‌ యాక్ట్రెస్, ఫేవరెట్‌ హీరోయిన్‌’ అవార్డ్‌లను సొంతం చేసుకున్నారు.

‘‘ప్రౌడ్‌ ఆఫ్‌ యు నయనతార. ఇంకా పైకి ఎగురు. హృదయాల్ని గెలుస్తూనే ఉండు’’ అంటూ ‘‘నా అవార్డ్‌ (నయనతార)తో తనకొచ్చిన అవార్డ్స్‌’’ అంటూ ట్వీటర్‌లో ఈ ఫొటో షేర్‌ చేశారు విఘ్నేష్‌ శివన్‌. కొంత కాలంగా విఘ్నేష్‌–నయన లవ్‌లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ ఇద్దరూ జాయింట్‌గా కొన్ని ఫంక్షన్స్‌కి ఎటెండ్‌ అవ్వడం, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు, ట్వీట్స్‌.. లవ్‌లో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి.. ఏడడుగులు ఎప్పుడు వేస్తారో? 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top