ఫేమస్‌ డైలాగ్‌.. క్యూట్‌ రియాక్షన్‌

Vicky Kaushal Share An Adorable Video of A Toddler Laughing - Sakshi

యావత్‌ దేశాన్ని ఉర్రూతలూగించిన డైలాగ్‌ ‘హౌ ఈజ్‌ ద జోష్‌’. ఉగ్ర స్థావరాలపై భారత్‌ తొలిసారి జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో తెరకెక్కిన  ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’ సినిమాలోనిది ఈ డైలాగ్‌. ఇది ఎంత వైరల్‌ అయ్యిందంటే.. సామాన్యుల నుంచి సెలబ్రీటల వరకూ ఆఖరికి రాజకీయ నాయకులు కూడా ఈ డైలాగ్‌ను వాడారు. దేశవ్యాప్తంగా అందరికి నచ్చిన ఈ డైలాగ్‌ ఓ రెండు నెలల చిన్నారికి కూడా విపరీతంగా నచ్చేసింది. డైలాగ్‌కు ఆ బుడతడు ఫిదా అయితే.. వాడి రియాక్షన్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీరిలో ‘ఉరి’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన విక్కీ కౌశల్‌ కూడా ఉన్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు విక్కీ. ‘మనందరికీ దీని అవసరం ఉంది కాబట్టి..’  అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో ఓ యువతి ‘హౌ ఈజ్‌ ది జోష్‌’ అని రెండు నెలల చిన్నారిని అడుగుతుంటే ఆ బుడతడు డైలాగ్‌ విని తెగ నవ్వేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ వీడియోను 12 లక్షల మందికి పైగా చూశారు. ‘ఉరి’ కాల్పులకు ప్రతీకారంగా 2016లో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో ఆదిత్య ధర్‌ ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’సినిమాను  తెరకెక్కించారు. బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2018లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ బాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top