సీనియర్ నటి సూర్యకళ కన్నుమూత

సీనియర్ నటి సూర్యకళ కన్నుమూత - Sakshi


సీనియర్ నటి కె.సూర్యకళ (72) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కాకినాడకు చెందిన రామిరెడ్డి, సుభద్రల కుమార్తె సూర్యకళ బాల్యం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు. సినీరంగంపై ఆసక్తితో చెన్నై చేరుకున్న సూర్యకళ ‘నా చెల్లెలు’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. ఏయన్నార్, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించారు. ‘బాల నాగమ్మ’లో ముఖ్య పాత్ర పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు.

 

 తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు పొందారామె. తమిళంలో శివాజీగణేశన్ నటించిన ‘అందనాళ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యకళ మొత్తం 500 చిత్రాలకు పైగా నటించారు. ఆమె చెన్నై నుంగంబాక్కంలోని వల్లువర్‌కోట్టం కాలనీలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సూర్యకళ సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె భర్త సెల్వరాజ్ పదేళ్ల క్రితమే మరణించారు. వీరికి పద్మశ్రీ అనే కూతురు ఉన్నారు. సూర్యకళ అంత్యక్రియలు మంగళవారం ఉదయం చెన్నైలో జరిగాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top