బాలీవుడ్‌ సీనియర్‌ నటుడికి క్యాన్సర్‌

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడికి క్యాన్సర్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, అమెరికా సంతతికి చెందిన టామ్‌ ఆల్టర్‌(67)  బోన్‌ కెన్సర్‌ బాధపడుతున్నారు. క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌లో ఉండటంతో ఆయన సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై టామ్‌ ఆల్టర్‌ కొడుకు జెమీ ఆల్టర్‌ను సంప్రదించగా అస్వస్థతకు గురైన విషయం వాస్తవేమేనని, మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని, తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తానన్నారు. 

 

టామ్‌ ఆల్టర్‌ ఇండియా షోబిజ్‌ టీవీ ప్రోగ్రామ్‌ ద్వార ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న టామ్‌ఆల్టర్‌ పలు బాలీవుడ్‌ చిత్రాల్లో, టీవీ సిరీస్‌ ప్రోగ్రామ్‌లో నటించారు. టామ్‌ చివరగా ఇమ్రాన్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ‘సర్గోశియాన్‌’ చిత్రంలో నటించారు. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top