వెంకీ మామ ఎప్పుడొస్తాడో!

Venky Mama Movie Release Date Problem - Sakshi

విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్‌ 4న రిలీజ్ చేయాలని భావించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్‌ అయ్యారు. దీంతో వెంకీమామ టీం ఆలోచనలో పడ్డారు. సైరా లాంటి సినిమాతో పోటి పడే కన్నా సినిమాను కాస్త వాయిదా వేయటం బెటర్ అని భావిస్తున్నారట. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కు తమన్ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top