ఉపాసన చాలెంజ్‌ ఎవరికి..?

Upasana Kamineni Fitness Challenge - Sakshi

టాలీవుడ్ లో ఫిట్‌సెస్‌ చాలెంజ్‌ ట్రెండ్ నడుస్తోంది. టాప్‌ స్టార్స్‌ అందరూ తమ జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ సన్నిహితులను చాలెంజ్‌ చేస్తున్నారు. స్టార్స్‌తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా చాలెంజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భార్య ఉపాసన చేరింది. హీరోయిన్‌ సమంత విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన ఉపాసన తన వర్క్‌ అవుట్‌ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు.

సమంత చాలెంజ్‌ ను స్వీకరించిన ఉపాసన.. నమత్రా శిరోద్కర్‌, కనికా కపూర్‌, తరుణ్‌ తహిలియాని, పింకీ రెడ్డిలను చాలెంజ్‌ చేశారు. ఎన్టీఆర్ చాలెంజ్‌ ను స్వీకరించిన రామ్‌ చరణ్ కూడా ఉపాసన సోషల్‌ మీడియా పేజ్‌తో తన వర్క్‌ అవుట్ వీడియోను పోస్ట్ చేశారు. చెర్రీ.. సుకుమార్‌, కేటీఆర్, అబూ జైన్‌ సందీప్‌ కోస్లా, శోభన కామినేని, వరుణ్ తేజ్‌ లతో పాటు మెగాస్టార్‌ చిరంజీవిని చాలెంజ్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top