సందేశాల ఉన్మాది

unmadhi movie sensor works - Sakshi

ఎన్‌ఆర్‌ రెడ్డి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉన్మాది’. ఎన్‌. కరణ్‌రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఎన్‌.ఆర్‌. రెడ్డి మాట్లాడుతూ– ‘‘గుంటూరు నకిరికల్లులోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ చిత్రం తెరకెక్కించాం. 8 ఫైట్లు, 5 పాటలతో పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది. అలాగే మంచి సందేశం కూడా ఉంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా చిత్రీకరించాం అనుకుంటున్నాను’’ అని అన్నారు. శివ, శిరీషా, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, కెమేరా: దంటు వెంకటేశ్, నిర్వహణ: ఎన్‌. వరలక్ష్మి, క్రియేటివ్‌ డైరెక్టర్‌: రాఘవ, నిర్మాత : ఎన్‌.రామారావు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top