‘ఖైదీ’ కలెక్షన్లు ఫుల్.. ఫ్యాన్స్‌ ఖుష్‌!

‘ఖైదీ’ కలెక్షన్లు ఫుల్.. ఫ్యాన్స్‌ ఖుష్‌!


హైదరాబాద్: చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’  బుధవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్ అమ్మా.. బాస్‌ ఈస్‌ బాక్ ట్యాగ్ లైనుకు మెగాస్టార్ పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్, డాన్స్, టైమింగ్, ఎగ్జిక్యూషన్ కుదిరాయి. మెగాఫ్యాన్స్ కు సంక్రాంతి మొదలయింద’ని ఓ అభిమాని చేసిన ట్వీట్ ను మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్ఎస్ తమన్ రీట్వీట్ చేశాడు.ఖైదీ నంబర్‌ 150 పెద్ద హిట్ కాబోతుందని పేర్కొంటూ హీరోయిన్ కాజల్ ధియేటర్‌ లో అభిమానుల సందడి ఫొటో పెట్టింది. అమెరికాలో ప్రీమియర్‌ షోలు పూర్తి కాకుండానే మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయని సమాచారాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్, కమెడియన్ వెన్నెల కిశోర్‌ రీట్వీట్‌ చేశారు. ప్రీమియర్ షో గ్రాస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ ని అధిగమించే దిశగా ‘ఖైదీ’  పయనిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ చిత్రం రూ.100 కోట్లు మించి వసూళ్ల సాధిస్తుందని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Back to Top