మహేష్‌ వీడియో షేర్‌ చేసిన ఎంపీ కవిత

TRS MP Kavitha Posted Mahesh Babu Video And Tells Birthday Wishes - Sakshi

రక్షా బంధన్‌కు హెల్మెట్‌ను కానుకగా ఇవ్వండి అంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గతేడాది ఓ క్యాంపైన్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అది చాలా పాపులర్‌ అయి రాఖీ సందర్భంగా తమ అన్న, తమ్ముళ్లకు హెల్మెట్లను కానుకగా ఇచ్చారు. తాజాగా ఈ క్యాంపైన్‌కు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన వంతు సహాయాన్ని అందించారు. 

నేడు ప్రిన్స్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా కవిత తన ట్విటర్‌ ఖాతాలో.. మహేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌ క్యాంపైన్‌కు బాసటగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మహేష్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు. మన దేశంలో రోజూ జరిగే ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 28 మంది చనిపోతున్నారని.. అంటే 28 కుటుంబాలు తమకిష్టమైన వ్యక్తిని కోల్పోతున్నాయని ఆవేదన చెందారు. ఈ రాఖీ పండుగకు సిస్టర్స్‌.. తమ అన్నదమ్ముళ్లకు హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ధరించమని చెప్పాలంటూ కోరారు. ఒక ప్రాణాన్ని కాపాడితే ఒక కుటుంబాన్ని కాపాడినట్టే అని మహేష్‌ చెప్పిన వీడియోను పోస్ట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top