డేట్‌ ఫిక్స్‌!

Trivikram Srinivas to direct Allu Arjun in his next - Sakshi

ఈఏడాది మేలో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి వచ్చారు అల్లు అర్జున్‌. అప్పటి నుంచి ఆయన తర్వాతి చిత్రం గురించి చాలామంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కొందరు తమిళ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ, ఫైనల్‌గా త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ సినిమా ఫిక్స్‌ అయ్యింది. ఈ సినిమా తాజా సమాచారం ఏంటంటే.. డిసెంబర్‌ 11న స్టార్ట్‌ కానుందట. అంతేకాదు ఈ మూవీ ఓ హిందీ సినిమాకు రీమేక్‌ అని టాక్‌. అయితే ఈ సినిమా  హారికా హాసినీ బ్యానర్‌లో రూపొందుతుందా? లేక గీతాఆర్ట్స్‌ నిర్మిస్తుందా? అనే డౌట్స్‌కు త్వరలోనే క్లారిటీ రానుంది. ఇంతకుముందు అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top