మాల్‌దీవుల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా..

Trisha Open Up Her Marriage - Sakshi

చెన్నై చిన్నది త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముచ్చటగా మూడన్నర పదుల వయసు మీద పడ్డా కొత్తకొత్త అందాలతో మెరిసిపోయే ఈ అమ్మడికి ఇటీవల విజయ్‌ సేతుపతితో రొమాన్స్‌ చేసిన 96, రజనీకాంత్‌తో జత కట్టిన పేట చిత్రాల విజయాలు మరింత నూతనోత్సాహాన్నిచ్చాయి. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తయారు చేసిన కథతో శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో పాటు మరో కొత్త చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న ఈ బ్యూటీ అంతకుముందు నటించిన చతురంగవేట్టై, తను సెంట్రిక్‌ పాత్రలో నటించిన పరమపదం విళైయాట్టు, గర్జన చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి.

కాగా గర్జన చిత్రంతో పాటు ప్రస్తుతం నటిస్తున్న రాంగీ చిత్రంలోనై త్రిష యాక్షన్‌ సన్నివేశాల్లో దుమ్మురేపుతుందట. తాజాగా షూటింగ్‌లకు చిన్న విరామం రావడంతో ఆ సమయాన్ని ఎంజాయ్‌ చేయడానికి మాల్‌దీవులకు చెక్కేసింది. అక్కడ ఉత్సాహంగా ఎంజాయ్‌ చేస్తూ స్విమ్మింగ్‌ దుస్తుల్లో ఉన్న ఒక ఫొటోనే సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. దానితో పాటు చిన్న కొటేషన్‌ను కూడా పోస్ట్‌ చేసింది. అందులో నేను ఆసక్తిగా ఉన్నప్పుడే నన్ను సంప్రదించాలన్నదే నా సలహా అని పేర్కొంది. తరచూ అభిమానులతో ట్విట్టర్‌లో టచ్‌లో ఉండే త్రిష ఇటీవల అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చింది. అందులో ఒక అభిమాని పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ప్రస్తుతానికి తాను సింగిల్‌నేనని, పెళ్లి అవసరం వస్తే చేసుకుంటానని, ప్రస్తుతానికి ఆ అవసరం లేదని చెప్పింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top