...టు ఖమ్మం ఆడియో జర్నీ!

...టు ఖమ్మం  ఆడియో జర్నీ!


హీరో బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్, భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనందప్రసాద్‌లు ఈ నెల 17న హైలికాఫ్టర్‌లో హైదరాబాద్‌ టు ఖమ్మం వెళ్లనున్నారు. ఎందుకంటే... ఈ ముగ్గురి కలయికలో రూపొందిన ‘పైసా వసూల్‌’ పాటల్ని ఖమ్మంలోనే విడుదల చేయనున్నారు. అంటే... ఈ హెలికాఫ్టర్‌ జర్నీ ఆడియో జర్నీ అన్నమాట.ఈ సందర్భంగా వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారి ఇమేజ్, పూరిగారి స్టోరీ స్టైల్‌కి తగ్గట్టు అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు. ఖమ్మంలో నందమూరి అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో జరగనున్న భారీ వేడుకలో ఈ నెల 17న పాటల్ని విడుదల చేస్తాం. అదే రోజున ట్రైలర్‌ కూడా విడుదలవుతుంది. ఇటీవల విడుదలైన స్టంపర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. 68 గంటల పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన స్టంపర్‌ను, 70 లక్షలమందికి పైగా చూశారు. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను స్టంపర్‌ మరింత పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది’’ అన్నారు.  ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Back to Top