చిత్రాతి చిత్రంగా పార్టీ!

చిత్రాతి చిత్రంగా పార్టీ! - Sakshi


గత మూడేళ్లుగా ‘బాహుబలి’ కోసం యూనిట్ సభ్యులంతా రాత్రనకా, పగలనకా కష్టడ్డారు. ఈ సినిమా పనులన్నీ పూర్తయిపోయాయి. దాంతో రిలాక్స్ కావాలనుకున్నారు. అందుకే ఓ థీమ్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి అందరూ విచిత్రమైన వేషధారణలో హాజరయ్యారు.

 

 రాఘవేంద్రుడు మంత్రగాడిలా, రానా పిల్లలు భయపడే వేషంలో, ఈ పార్టీకి అతిథులైన నాని ఏమో ‘ఈగ’ అవతారంలో, దర్శకుడు క్రిష్ ఏమో సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో, రాజమౌళి తనయుడు కార్తికేయ ఆంజనేయుడిగా, నిర్మాతలు శోభు, ప్రసాద్‌లు వెరైటీ గెటప్స్‌లో, అనుష్క కొమ్ములతో.. ఇలా చిత్రాతి చిత్రమైన వేషధారణల్లో సందడి చేశారు.

 

 ఈ పార్టీలో రాజమౌళి, ప్రభాస్ తదితరులు పాల్గొనలేదు. ‘అందరూ ఎంజాయ్ చేస్తే ఎలా? పనులు ఉంటాయిగా’ అని శోభు యార్లగడ్డ ట్విట్టర్‌లో పెట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top