మరో అల్లు హీరో ఎంట్రీ

Third Hero Muttamsetty Viran from Allu Compound - Sakshi

అల్లు అరవింద్‌ పెద్ద నిర్మాత. ఆయన కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్‌ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అల్లు ప్రస్తావన ఎందుకంటే.. లేటెస్ట్‌గా అల్లు కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకు ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అరవింద్‌కు బంధువైన విరాన్‌ ముత్తంశెట్టి నటనపై తనకున్న ఇంట్రెస్ట్‌ను నిరూపించుకునేందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను చిట్టి శర్మ దర్శకత్వంలో సి.హెచ్‌.వి.యస్‌ బాబ్జీ నిర్మించనున్నారు. ‘‘చెడుని శిక్షించి, మంచిని రక్షించడం కోసం దేవుడు అవతారం ఎత్తుతాడనేది భగవద్గీత సారాంశం.

ధర్మం నశించి, దేవుడి ఉనికే ప్రశ్నగా మారిన ఇప్పటి లోకానికి దేవుడిని పరిచయం చేసిన యువకుడి కథే మా చిత్రం. డివోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందబోయే ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌లో స్టార్ట్‌ కానుంది’’ అన్నారు నిర్మాత బాబ్జీ. ‘‘గ్రాఫిక్స్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రం షూటింగ్‌ను తిరుపతి, కేరళ, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తాం’’ అన్నారు సహ నిర్మాత ఇ. దర్మప్రసాద్‌. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్యప్రకాష్, సంగీతం: జీబు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top