వాసుకి పోరాటం

వాసుకి పోరాటం


మలయాళ బ్యూటీ నయనతార టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘పుదియ నియమం’. గత ఏడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకుగానూ ఫిలింఫేర్‌ ఉత్తమ నటి అవార్డును నయనతార సొంతం చేసుకున్నారు.ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ సినిమా పతాకంపై ‘వాసుకి’ పేరుతో ఎస్‌.ఆర్‌. మోహన్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మోహన్‌ మాట్లా డుతూ– ‘‘ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యపై తెరకెక్కిన చిత్రం కావడం, నయనతార లీడ్‌ రోల్‌ చేయడంతో సినిమాపై మంచి క్రేజ్‌ నెలకొంది. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు స్పందన బాగుంది. పంపిణీదారులు కూడా మా సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు ‘వాసుకి’ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Back to Top