లఘు చిత్ర దర్శకుడికి జాతీయ స్థాయి అవార్డ్

Telangana Short Film Maker Dr Anand Awarded For His Social Service - Sakshi

గత కొన్ని సంవత్సరాలుగా బంజారా మహిళా యన్ జీ వో ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు గాను తెలుగు వైద్యుడు, సినీ దర్శకులు డాక్టర్ ఆనంద్‌కు సేవా రంగంలో జాతీయ స్థాయి అవార్డ్ లభించింది. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ మరియు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు సంయుక్తంగా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో, దేశ వ్యాప్తంగా వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రదర్షణ కన పరచిన  వారికి జాతీయ స్థాయి అవార్డులను అందజేశారు.

ఢిల్లీ లోని ఆంధ్ర మరియు తెలంగాణా భవన్ లోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణా భవన్ కమీషనర్ శ్రీ వేణు గోపాలా చారి (ఐఏయస్),  జస్టిస్ పి.యస్.నారాయణ, డా. వరికుప్పల శ్రీనివాస్ (వాటర్ ట్రిబ్యునల్ మెంబర్), డా.బింగి నరేందర్ గౌడ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్‌ల ప్రధానం జరిగింది.

ఈ సందర్భంగా డా.ఆనంద్ మాట్లాడుతూ, తను ఎన్నో ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి సహాయ సహ కారాలను అందిస్తున్న మిత్రులందరికీ, సంస్థలకు ప్రత్యేక ధన్య వాదాలు తెలియ చేసారు. ఈ అవార్డ్‌ ను మాజీ కేంద్ర మంత్రి వర్యులు దివంగత అరుణ్ జైట్లీ గారికి అంకిత మిస్తునట్లుగా ఆయన తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top