టీవీ ఛానెల్‌పై ఫైర్‌ అయిన తాప్సీ

Taapsee Slams TV Channel Says She Was Falsely Quoted - Sakshi

‘టీర్పీ, వ్యూస్‌ కోసం మీడియా చానెల్‌ పీఆర్‌ టీమ్‌ చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నేను చెప్పిన దాన్ని వక్రీకరించడమే కాకుండా..నా వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేక అర్థం వచ్చేలా చేశారు! షోలో నా మాటలను చెప్పినవి చెప్పినట్లుగా ప్రసారం చేస్తే వినోదాన్ని పంచడం వీలవుతుంది. కానీ ఇలా చీప్‌ స్టంట్లతో కాదు’ అంటూ హీరోయిన్‌ తాప్సీ పన్ను ఓ టీవీ ఛానెల్‌పై ఫైర్‌ అయ్యారు. తన మాటలకు తప్పుడు భాష్యం చెప్పారంటూ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కలర్స్‌ ఇన్‌ఫినిటీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘బీఎఫ్‌ఎఫ్‌ విత్‌ వోగ్‌’ షోకు తాప్సీ, సహ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగా ఓ ప్రశ్నకు బదులుగా.. ‘ మగాళ్లంతా పనికిరాని వారే.. ఒక్క విక్కీ తప్ప’ అని తాప్సీ అన్నట్లుగా చానెల్‌లో ప్రసారమైనట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అదే విధంగా సినిమా షూటింగ్‌ కంటే ముందే తాప్సీ, విక్కీలు వాట్సాప్‌లో చాటింగ్‌ చేసేవారని, వారికి ఇది వరకే పరిచయం ఉందన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై తాప్సీ పైవిధంగా స్పందించారు. కాగా అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మన్‌మర్జియాన్‌ సినిమాలో తాప్సీ, విక్కీ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా విమర్శల ప్రశంసలు దక్కించుకుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top