నో వర్కర్స్‌.. నో హాలిడే!

నో వర్కర్స్‌.. నో హాలిడే!


ఉద్యోగులకు ఏడాదిలో ఇన్ని సెలవులంటూ ఉంటాయి. నటీనటులకు వాళ్లు చేసే సినిమా షెడ్యూల్స్‌ను బట్టి కొన్ని రోజులు ఫ్రీ టైమ్‌ ఉంటుంది. కానీ, ఏదో ఒక వ్యాపారం చేసే మహిళలకు (బిజినెస్‌ విమెన్‌) జీవితంలో సెలవు రోజనేది ఉండదంటున్నారు తాప్సీ. సడన్‌గా ఈమె చూపు బిజినెస్‌ విమెన్‌ మీద ఎందుకు పడిందంటే... చెల్లెలు షగున్‌ పన్నుతో కలసి తాప్సీ ‘వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ’ అనే కంపెనీ స్టార్ట్‌ చేశారు.కాంట్రాక్ట్‌ పద్ధతిలో పెళ్లి పనులన్నీ దగ్గరుండి ఈ కంపెనీ చేస్తుందన్నమాట. పెళ్లి పనులంటే... ఫ్లవర్‌ డెకరేషన్, గట్రా అన్నీ ఉంటాయి కదా! ఇటీవల ఓ పెళ్లిలో వర్కర్స్‌ తక్కువయితే తాప్సీయే స్వయంగా ఫ్లవర్‌ డెకరేషన్‌ వంటి చిన్న చిన్న పనులన్నీ చేశారు. పాపం.. షూటింగ్‌కి కాస్త గ్యాప్‌ దొరికితే రిలాక్స్‌ అవ్వాలనుకున్నారట. కానీ, హాలిడే లేకుండా పని చేయాల్సి వచ్చింది. ‘‘బిజినెస్‌ విమెన్‌ లైఫ్‌లో ఒక్క ఆఫ్‌డే (సెలవు రోజు) కూడా ఉండదు’’ అని ఆమె పరిస్థితిని వివరించారు.

Back to Top