పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

Taapsee Pannu React on Her Wedding News - Sakshi

సినిమా: అవును నేను ప్రేమలో పడ్డాను. అయితే పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాను అని అంటోంది నటి తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకుడిగా పరిచయమైంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది. అదేవిధంగా టాలీవుడ్‌లోనూ నటించింది. ఆ తరువాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ హీరోయిన్‌గా ఇప్పుడు దుమ్మురేపుతోంది. అదేవిధంగా ఆదిలో అందాలారబోతకే పరిమితమైన ఈ అమ్మడు ఇప్పుడు నటనకు అవకాశం కలిగిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా పాత్రల్లోనూ సక్సెస్‌లు అందుకుంటోంది. ఇటీవల తాప్సీ నటించిన మిషన్‌మంగళ్‌ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. తడ్కా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అదేవిధంగా సాద్‌ కీ ఆంఖ్‌ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం రాష్మీ రాకెట్‌ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

త్వరలో తమిళంలో నటుడు జయంరవితో జత కట్టడానికి పచ్చజెండా ఊపింది. కాగా 32 ఏళ్ల ఈ చిన్నది ఇప్పుడు తరుచూ ప్రేమ, పెళ్లి విషయాలను వల్లివేస్తోంది. ఈ సందర్భంగా ఒక పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ పేర్కొంటూ తనకింకా పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. అయితే ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెప్పింది. అతను నటుడు కాదు, క్రికెట్‌ క్రీడాకారుడూ కాదు. అసలు ఈ ప్రాంతానికి చెందిన వాడే కాదు అని అంది. ఇకపోతే ఇంట్లో పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నారని చెప్పింది. అయితే తనకు పిల్లలు కనాలనిపించిన్నప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. వివాహసంబంధంతోనే పిల్లలను కనాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. వివాహం అనేది బంధువులు, సన్నిహితులు, మిత్రుల సమక్షంలోనే జరుగుతుందని, అదీ ఒక్క రోజు వేడుకగానే జరగాలని, అంతకు మించి పలు రోజులు జరగడం తనకిష్టం ఉండదని అంది. ఇంతకంటే పెళ్లి గురించి వివరించలేనని పేర్కొంది. ఈ ఇంటర్వ్యూ సమయంలో తాప్సీ చెల్లెలు కూడా తనతో ఉంది. తన ద్వారానే తాప్సీకి ఆమె ప్రేమికుడు పరిచయం అయ్యాడని, అందుకు తాప్సీ తనకు థ్యాంక్స్‌ చెప్పాలని ఆమె చెల్లెలు అంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top