సినిమాతో నా జీవితం ఆగదు

Taapsee Pannu Hotel Business With Sister - Sakshi

సినిమా: సినిమాతో తన జీవితం ఆగదు అంటోంది నటి తాప్సీ. సాధారణంగా దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్లుగా రాణించి బాలీవుడ్‌పై కన్నేసే తారలను చూశాం. అలాంటిది నటి తాప్పీ అందుకు భిన్నం అని చెప్పాలి. ఈ ఢిల్లీ భామ దక్షిణాదిలో తన కంటూ ఒక అంతస్తు కోసం చాలానే పోరాడింది. హీరోయిన్‌గా గుర్తింపు పొందినా, అగ్రకథానాయకి అనిపించుకోలేకపోయింది. అలాంటిది బాలీవుడ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలు, స్టార్‌ హీరోలకు జంటగా అంటూ దుమ్మురేపుతోంది. పింకు, నామ్‌ సబానా వంటి చిత్రాల తాప్పీ నట కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. తనకు ధైర్యం ఎక్కువ అని చెప్పుకునే తాప్సీ ఏ మంటుందో చూద్దాం. నేను అపజయాలకు  చింతించను. ఆ విషయాన్ని మీరు త్వరలోనే తెరపై చూస్తారని అనుకుంటున్నా. అపజయం ఎదురైతే అంతటితోనే జీవితం ముగిసిపోతుందా? ఏమిటి.

నేను విజయం కోసం మళ్లీ ప్రయత్నిస్తాను. నా చిత్రాలు అపజయం పాలైతే నేను ఇంకేమైనా చేస్తాను. అంతే కానీ అంతటితో నా జీవితం ముగిసి పోదు. ఆ ధైర్యమే నన్ను మంచి కథా చిత్రాలను ఎంచుకోవడానికి దోహద పడుతోందని అనుకుంటున్నాను. నా చెల్లెలు షకుణుతో కలిసి ఒక హోటల్‌ ప్రారంభిద్దామనే ఆలోచనలో ఉన్నాను. తగిన సమయం లభించగానే ఆ ప్రయత్నాన్ని అమల్లోకి తీసుకొస్తాను. సినిమాకు సంబంధంలే కుండా కొన్ని  విషయాలను చేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో సినిమాకు దూరం అయితే దానికి సంబంధంలేని మరోవృత్తి నా చేతిలో ఉండాలి. సినిమాను మించి మరో జీవితం ఉంది. నేను ఎవరితోనూ అంతగా క్లోజ్‌గా ఉండను. అందువల్లే సినిమా వాళ్లు మారిపోయారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేను. అయితే ఇప్పుడు మంచి స్క్రిప్ట్‌లు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. విజయాన్ని దక్కించుకున్న తరువాత నాకు మర్యాద పెరిగింది. నా అభిప్రాయాలను తెసుకోవాలనుకుంటున్నారు. నా కఠినశ్రమకు ఫలితం లభిస్తోంది అని అంటున్న ఈ అమ్మడు ఇప్పటికే తన చెల్లెలు, స్నేహితురాళ్లతో కలిసి వెడ్డింగ్‌ ప్లానర్‌ పేరుతో వివాహవేడుకలను నిర్వహించే సైడ్‌ బిజినెస్‌ను నడుపుతోందన్నది గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top