సైరా రిలీజ్‌ ప్లాన్స్‌..!

Sye raa Will Be Release On 2019 Summer - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం సైరా నరసింహారెడ్డి. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుధీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. చిరు 151వ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2019 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. భారీ బడ్జెట్‌ సినిమా కావటంతో సమ్మర్‌ రిలీజ్‌ అయితే కలెక్షన్ల పరంగా కలిసోస్తుందని భావిస్తున్నారట. గ్రాఫిక్స్‌వర్క్‌ కూడా భారీగా ఉం‍డటంతో వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top