మహేష్ వాయిదా వేస్తాడా..?

Sye Raa Narasimha Reddy Vs Maharshi In Summer - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుల మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాదు ఫారిన్‌ టూర్‌లకు కూడా ఇద్దరు కలిసి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత స్నేహంగా ఉండే ఈ ఇద్దరు స్టార్లు 2019 సమ్మర్‌లో ముఖాముఖీ తలపడనున్నారు.

మహేష్‌ బాబు 25వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. మహేష్‌ డిఫరెంట్‌లుక్‌లో అలరిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే రామ్‌ చరణ్ నిర్మాతగా మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న సైరా నరసింహారెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్‌కే రిలీజ్ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఇలా రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో రిలీజ్‌ అయితే రెండు సినిమాలకు నష్టం జరుగుతుంది. గతంలో బాహుబలి రిలీజ్ సమయంలోనూ పోటి ఉండకూడదన్న ఉద్దేశంతో మహేష్‌ శ్రీమంతుడు సినిమాను వాయిదా వేశాడు. మరి ఇప్పుడు సైరా కోసం కూడా తన సినిమా వాయిదా వేస్తాడా..? లేక బరి దిగుతాడా చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top