11 శాఖల ప్రయాణం

Surya Asthamayam Movie lanches - Sakshi

రెండు పడవల ప్రయాణం కష్టం. అలాంటిది పదకొండు పడవలంటే ఇంకా కష్టం. అలాంటిది ‘సూర్యాస్తమయం’ సినిమా కోసం బండి సరోజ్‌ కుమార్‌ 11 శాఖలు నిర్వహించడం విశేషం. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్, సంగీతం, ఫైట్లు, ప్రొడక్షన్‌ డిజైనర్, కెమెరా శాఖలతో పాటు ప్రధాన పాత్రలో నటించి, ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు సరోజ్‌ కుమార్‌. ఓజో మీడియా పతాకంపై రఘు పిల్లుట్ల, రవికుమార్‌ సుదర్శి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. బండి సరోజ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఒక పోలీస్‌కీ, గ్యాంగ్‌స్టర్‌కీ మధ్య జరిగే కథే ‘సూర్యాస్తమయం’. సహజమైన లొకేషన్లలో, ఆర్టిస్టులకు  మేకప్‌ ఉపయోగించకుండా నేచురల్‌గా తీశాం. పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నేను, గ్యాంగ్‌స్టర్‌గా త్రిశూల్‌ రుద్ర నటించాం. తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ కీలకమైన పాత్ర పోషించారు. త్వరలోనే ట్రైలర్‌ని, సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top