హద్దుల్లేని అభిమానం

Suriya Movie Shootong In Rajahmundry - Sakshi

పెరంబూరు: నటుడు సూర్య ఆదివారం అభిమానుల ఆనంద సాగరంలో తడిచి ముద్దయ్యారు. పవర్‌ఫుల్‌ పాత్రలకు పెట్టింది పేరు సూర్య. ఈయన నటనకే కాదు డైలాగ్స్‌కు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఇక ఆయన అభిమానుల సంగతి వేరే చెప్పాలా! సూర్యకు తమిళంలోనే కాదు, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది మొత్తం అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో ఈయన చిత్రాలకు సూపర్‌ ఫాలోయింగ్‌ ఉంది.

సూర్య ప్రస్తుతం ఎన్‌జీకే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీÔశంకర్‌ కూడా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు సెల్వరాఘవన్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అంతే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలనుంచి సూర్యను చూసేందుకు ఆదివారం ఉదయం సుమారు 500 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. దీంతో క్యారవన్‌లో ఉన్న సూర్య వారి అభిమానానికి ముగ్ధుడై అందరికీ అభివాదం చేస్తూ,  కిందకు దిగి షేక్‌హ్యాండ్‌ ఇస్తూ సంతోషపరిచారు. సూర్యతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు, సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో చిత్ర షూటింగ్‌ కొంత సేపు నిలిచిపోయిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఆ అభిమాన గణాన్ని చూసి సూర్య ఆంధ్రాలో ఉన్నారా? లేక తమిళనాడులో ఉన్నారా? అన్నంత ఆశ్యర్యం కలిగిందని వారు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top