సన్నీలియోన్ ‘వీరమహాదేవి’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది..

Sunny Leone Veeramadevi First Look Released - Sakshi

సాక్షి, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా ‘వీరమహాదేవి’.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో సన్నీలియోన్ వీరమహాదేవిగా గుర్రంపై స్వారీ చేస్తూ గాంభీర్యంగా కనిపిస్తోంది. సన్నీ లియోన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘వీరమహాదేవి’  సినిమాకి వీసీ వడివుడయాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. అంతకుముందు ఐటమ్‌ సాంగ్స్, స్పెషల్‌ రోల్స్‌లో అలరించిన సన్నీ సౌత్‌లో హీరోయిన్‌గా చేస్తోన్న తొలి సినిమా ఇది. ఇందులో నవదీప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సన్నీ లియోన్ ‌‘క్వీన్‌’ వీరమహాదేవి పాత్ర కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top