నాన్‌ వీరమాదేవి

 Sunny Leone Makes Tamil Debut With Veeramadevi. Posts Update - Sakshi

... అంటున్నారు సన్నీ లియోన్‌. అంటే ‘నేను వీరమాదేవి’ అని అర్థం. హఠాత్తుగా సన్నీ ఎందుకు పేరు మార్చుకున్నారు అనుకుంటున్నారా? ఒరిజినల్‌ నేమ్‌ సన్నీనే. ఇది సినిమా పేరు. ఈ హాట్‌ గాళ్‌ ఇప్పటివరకూ తెలుగు, తమిళ భాషల్లో ఐటమ్‌ సాంగ్స్, అతిథి పాత్రలు చేశారు. ఫస్ట్‌ టైమ్‌ లీడ్‌ రోల్‌ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వడివుడయాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న పీరియాడికల్‌ మూవీ ఇది. ఈ చిత్రానికి తెలుగులో ‘వీరమహాదేవి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

తమిళంలో ‘వీరమాదేవి’ అని పెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో మాట్లాడుతూ ఈ టైటిల్‌ను స్వయంగా సన్నీ ఎనౌన్స్‌ చేయడం విశేషం. ‘‘వణక్కమ్‌ తమిళర్‌గళే. నాన్‌ వీరమాదేవియాగ ఉంగళై సంధిక్క పోగిరేన్‌’’ అని సన్నీ ముద్దు ముద్దుగా తమిళ పలుకులు పలికారు. ‘‘నమస్కారం తమిళీ యులే. నేను వీరమా దేవిగా మిమ్మల్ని కలవబోతున్నా’’ అన్నది అర్థం. బుధవారం టైటిల్‌ ప్రకటించారు. కొత్త సంవత్సరానికి సన్నీ లుక్‌ని విడుదల చేస్తారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top