ఈ హీరో సెల్ఫీకి, ఆల్‌ స్మైలీస్‌కి ఫిదా

Sunday lunch with family- Hero varun tej - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెగా ఫ్యామిలీ  క్రేజీ హీరో వరుణ తేజ్‌ మరోసారి ఆసక్తికరమైన ఫోటోలను షేర్‌ చేశారు. ప్రముఖ నటుడు నాగబాబు కుమారుడు, టాలీవుడ్‌ హీరో వరుణ్ తేజ్  ఫ్యామిలీ సెల్పీని,  చైతూ, సామ్‌ల రిసెప్షన్‌ ఫోటోను షేర్‌ చేశారు.  తరచూ  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ..పర్సనల్‌ ప్రొఫెషనల్‌ విషయాలను ఫోటోలను ఫాలోయర్స్‌ ను ఫిదా చేసే ఈ హీరో మరోసారి ఈ రెండు  ఫోటోలతో  ఆకట్టుకున్నారు.  

తాజాగా సండే లంచ్ విత్ ఫ్యామిలీ అంటూ తన కుటుంబ సభ్యులుతో కలిసి దిగిన ఫోటోను, ఆల్‌ స్మైలీస్‌ అంటూ  నాగ చైతన్య, సమంత రిసెప్షన్‌ వేడుక ఫోటోలను షేర్ చేశారు. వరుణ్‌ తేజ్‌. ఈ సెల్ఫీలో ఇటు వరుణ్ తేజ్ , అటు నిహారిక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారంటూ అభిమానులు కమెంట్‌  చేస్తూ లైక్స్‌ కొడుతున్నారు. 

కాగా ఫిదా  సినిమా భారీ విజయంతో హుషారుగా ఉన్న  వరుణ్ తేజ్ ప్రస్తుతం అట్లూరి దర్శకత్వంలో   రూపొందుతున్న  చిత్రంలో  నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

Back to Top