ఖైదీ నెం.150 పాట ఆన్‌లైన్‌లో లీక్!

ఖైదీ నెం.150 పాట ఆన్‌లైన్‌లో లీక్!

దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెం. 150 సినిమా థియేటర్లలో అలా విడుదలయ్యిందో లేదో.. అప్పుడే అందులోని ఒక పాట మొత్తం ఆన్‌లైన్‌లో లీకైపోయింది. పైరసీని అరికట్టేందుకు ఎంతగా పోరాటం జరుగుతున్నా, సినిమాలు విడుదల అవుతూనే వాటిలోని పాటలు, మొత్తం సినిమా కూడా ఈ మధ్య కాలంలో వెంటవెంటనే ఆన్‌లైన్‌లో వచ్చేస్తున్నాయి. 

 

అలాగే ఇప్పుడు ఖైదీ నెం. 150 లోని 'సన్న జాజిలా పుట్టేసిందిరో.. మల్లె తీగలా చుట్టేసిందిరో.. తేనెటీగలా కుట్టేసిందిరో సుందరీ ఈ సుందరీ' అనే పాట ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకై, వైరల్‌గా స్ప్రెడ్ అవుతోంది. దీనిపై సినిమా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎంతో కష్టపడి తాము సినిమా తీస్తుంటే, నిమిషాల వ్యవధిలోనే ఇలా ఆన్‌లైన్‌లో లీక్ చేయడం వల్ల అన్ని వర్గాలూ నష్టపోతున్నాయని అంటున్నారు.

 

Back to Top