వేచవి చూద్దాం!

వేచవి చూద్దాం! - Sakshi


...::: taste the box-office summer :::...

‘బాహుబలి’ కోసం చూస్తూ, నిరుడు సమ్మర్ సీజన్‌ను వృథా చేసుకున్న చిత్రసీమ ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు. కొందరు పెద్ద హీరోలు లేరనే కానీ, ఈ వేసవిలో బాక్సాఫీస్ ఆల్రెడీ హీటెక్కింది. ఈ రిలీజ్ ఫిల్మ్స్‌లో కొన్నిటిపై ఫోకస్...

 

 కుటుంబ బంధాల ‘బ్రహ్మోత్సవం’

 చిత్రం: ‘బ్రహ్మోత్సవం’


 తారాగణం: మహేశ్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, నరేశ్,తులసి, నిర్మాతలు: పరమ్, పెరల్ వి. పొట్లూరి, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

 ఇతివృత్తం: కుటుంబ బంధాల చుట్టూ తిరిగే కథ.

 హైలైట్స్:  ‘హమ్ ఆప్కే హై కౌన్’లా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భారీ తారాగణం, ఒకరికి ముగ్గురు హీరోయిన్లు  నిర్మాణ విలువలు  తోట తరణి (ఆర్ట్), రత్నవేల్ (కెమేరా), మిక్కీ జె. మేయర్ (సంగీతం) లాంటి పేరున్న టెక్నీషియన్స్ అండ  వినోదం, సెంటిమెంట్, ఎమోషన్స్‌తో సమ్మర్‌కి అందరూ చూసే ‘బాహుబలి’ లాంటి ‘ఈవెంట్ మూవీ’ అని నిర్మాతల మాట.

 ప్రోగ్రెస్: ఉత్తరాదిన కాశీ, హరిద్వార్, ఉదయ్‌పూర్‌లలో, దక్షిణాన ఊటీలో కీలక సీన్స్ చిత్రీకరించారు. 80 శాతం పూర్తి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏకధాటిగా షూటింగ్. ఏప్రిల్ 10న ఆడియో రిలీజ్‌కి ప్లాన్.

 బడ్జెట్: దాదాపు రూ. 75 కోట్లు   రిలీజ్: ఏప్రిల్ 29న. తెలుగుతో పాటు తమిళంలోనూ ‘బ్రహ్మోత్సవం’గా రిలీజ్.

 

 మాఫియా సెంటిమెంట్ ‘కబాలి’

 చిత్రం: ‘కబాలి’


 తారాగణం: రజనీకాంత్, రాధికా ఆప్టే, కిశోర్, ధన్సిక, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాత: ‘కలైపులి’ ఎస్. థాను. దర్శకత్వం: పా. రంజిత్

 ఇతివృత్తం: మాఫియా నేపథ్యం. యాక్షన్, సెంటిమెంట్ కలగలిసిన కథ.

 హైలైట్స్: విలక్షణమైన రజనీకాంత్ గెటప్, క్యారెక్టరైజేషన్. అప్పటి ‘బాషా’ లా ఇప్పుడు ఈ ‘కబాలి’ అని అంచనా.  హాంగ్‌కాంగ్, థాయిలాండ్, మలేసియాల్లో షూటింగ్ చేశారు.  చైనా సూపర్‌స్టార్ విల్సెన్ చో విలన్  

 ప్రోగ్రెస్: షూటింగ్ పూర్తి. ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతున్నాయి.

 బడ్జెట్: రూ. 100 కోట్ల పై మాటే! (తెలుగు, తమిళ భాషల్లో)

 రిలీజ్: మే నెలలో.

 

 వినోదాల విందు... ‘సర్దార్ గబ్బర్‌సింగ్’

 చిత్రం: ‘సర్దార్ గబ్బర్‌సింగ్’


 తారాగణం: పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్, శరత్ కేల్కర్, రాయ్‌లక్ష్మి, సంగీతం:  దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: శరత్ మరార్, సునీల్ లుల్లా, దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)

 ఇతివృత్తం: చాలాచోట్ల ప్రచారమవుతున్నట్లు ఈ సినిమా పవన్‌కల్యాణ్ సంచలనాత్మక హిట్ ‘గబ్బర్‌సింగ్’కు సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ కూడా కాదు. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా పవన్‌కల్యాణ్ కనిపించే ఈ భారీ చిత్రం పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ అని సమాచారం.

 హైలైట్స్:  కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో విస్తృత షూటింగ్ చేశారు. సినిమా నిండా వందలాది గుర్రాలు, వింటేజ్ కార్లతో గుర్రాల మేళా లాంటి భారీ ఎపిసోడ్లు, రతన్‌పూర్ లాంటి భారీ సెట్స్  రోజూ వందల మంది యూనిట్‌తో షూటింగ్ సాగుతున్న భారీ ఫిల్మ్. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్  నిర్మాణ, సాంకేతిక విలువలు పుష్కలం. కథాబలం, సన్నివేశ బలానికి తోడు అలరించే బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్, రామ్- లక్ష్మణ్‌ల యాక్షన్  రాయ్‌లక్ష్మితో ప్రత్యేక గీతంతో పాటు, అభిమానులకు పండగగా చిరంజీవి పాటకు డ్యాన్స్, ప్రసిద్ధమైన ‘వీణ స్టెప్’, పంచ్ డైలాగ్స్ సహా చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్.

 ప్రోగ్రెస్: దాదాపు నెలన్నర పైగా ఏకధాటిగా ఒకటికి రెండు యూనిట్లతో చిత్రీకరణ జరుగు తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. 17వ తేదీ కల్లా మొత్తం పూర్తి. ఆ రోజే హిందీ, తెలుగుల్లో టీజర్ రిలీజ్. మార్చి 20న ఆడియో రిలీజ్.  వెంటనే మిగిలిన 2 పాటల చిత్రీకరణకు ఛలో స్విట్జర్లాండ్, పవన్‌కల్యాణ్ ఇప్పటికే కొంత డబ్బింగ్ కూడా చెప్పారు. చెప్పిన డేట్‌కి రిలీజ్ కోసం యూనిట్ 24గంటలూ పనిచేస్తోంది.

 బడ్జెట్: సుమారు రూ. 70 కోట్లు

 రిలీజ్: తెలుగు ఉగాదైన ఏప్రిల్ 8న! హిందీ డబ్బింగ్ కూడా అదే రోజున వందలాది హాళ్లలో!

 

 కొత్త తరహా కథలకు... ‘ఊపిరి’

 చిత్రం: ‘ఊపిరి’


 తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా, సంగీతం: గోపీ సుందర్, నిర్మాతలు: పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: వంశీ పైడిపల్లి

 ఇతివృత్తం:  ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్‌టచబుల్స్’ ఆధారంగా రూపొందుతున్న చిత్ర మిది. శారీరకంగా వికలాంగుడైన వందల కోట్ల అధిపతికీ, సామాజికంగా వెనుక బడిన దిగువ మధ్యతరగతి మనిషికీ మధ్య స్నేహబంధమెలా ఏర్పడింది? ఇద్దరూ కలసి దాన్నెలా కొనసాగించారనే కథాంశంతో ఈ భారీ మల్టీస్టారర్ రూపొందు తోంది. ఒక నిజమైన తోడుంటే, జీవితమెలా ఉంటుందో చెబుతుంది. చాలామంది అనుకుంటున్నట్లిది ప్రయోగాత్మక చిత్రం కాదు. ఎమోషనల్ ఎంటర్‌టైనర్.

 హైలైట్స్:  శరీరం కదలించలేని వ్యాధిగ్రస్థుడై, చక్రాల కుర్చీకే పరిమితమైన వైవిధ్యభరిత పాత్రను నాగార్జున చేస్తున్నారు  ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళంలోనూ (తమిళ టైటిల్ ‘తోళా’) తీశారు. తొలిసారి నాగార్జున తమిళంలో, తమన్నా తెలుగులో డబ్బింగ్ చెప్పారు  ఈ చిత్రంలో నాగార్జున వాడే చక్రాల కుర్చీని ప్రత్యేకించి వాడేవారి శరీరం కొలతలకు తగ్గట్లుగానే స్వీడన్‌లో తయారుచేస్తారు. గడ్డంతో ఆపరేట్ చేసే ఈ కుర్చీని, నాగార్జున కొలతలకు తగ్గట్లు, రూ. 25 లక్షలు పెట్టి తయారుచేయించి, దిగుమతి చేసుకున్నారు మొత్తం 108 షూటింగ్ డేస్ పట్టిన ఈ సినిమాను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్‌గ్రేడ్, బల్గేరియా - ఇలా మొత్తం 5 దేశాల్లో చిత్రీకరించారు. విపరీతంగా ఖర్చయ్యే ప్యారిస్ లాంటి చోట్ల ‘క్వీన్’ లాంటి హిందీ చిత్రాల తర్వాత ఈ మధ్య ఇంత విస్తృతంగా షూటింగ్ చేసిన సౌతిండియన్ సినిమా ఇదే  ఆమిర్ ఖాన్ ‘గజనీ’, అమితాబ్ ‘పా’ లాంటి చిత్రాలకు పనిచేసిన మలయాళీ సునీల్ బాబు ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేయడం విశేషం.  వెండితెరపై ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ అని దర్శక, నిర్మాతలు చెబుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఒత్తిడి నుంచి దూరం చేయడమే కాక, టికెట్ ఖర్చుకే ప్యారిస్‌లోని ప్రధాన ప్రాంతాలన్నీ చూపే కనువిందు.

 ప్రోగ్రెస్: దర్శకుడు హైదరాబాద్, చెన్నైల మధ్య తిరుగుతూ, శర వేగంతో పోస్ట్ ప్రొడ క్షన్ చేయిస్తున్నారు.

 బడ్జెట్: 60 కోట్లు  

 రిలీజ్: మార్చి 25 (తెలుగు, తమిళాలు రెండూ)

 

  సరైన మాస్ యాక్షన్

 చిత్రం: ‘సరైనోడు’


 తారాగణం: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, సంగీతం: తమన్, నిర్మాత: అల్లు అరవింద్, దర్శకత్వం: బోయపాటి శ్రీను

 ఇతివృత్తం: లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్. ఎలాంటి బాదరబందీ లేని యువకుడి కథ. అమ్మాయి కోసం అతను ఏం చేశాడనేది కీలకాంశం.

 హైలైట్స్:  అల్లు అర్జున్ పాడిన పాట.  హీరో క్యారెక్టరైజేన్  హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్ర.

 ప్రోగ్రెస్: సౌత్ అమెరికాలో బొలీవియాలో ఉయు నిలో తాజాగా పాట తీశారు. షూటింగ్ పూర్తి. తుదిదశలో పోస్ట్ ప్రొడక్షన్. ఏప్రిల్ ఫస్ట్‌కే రెడీ.

 బడ్జెట్: సుమారు రూ. 45 కోట్లు

 రిలీజ్: ఏప్రిల్ 22న.

 

 ఫీల్‌గుడ్‌గా సాగిపో

 చిత్రం: ‘సాహసం శ్వాసగా సాగిపో’


 తారాగణం: నాగచైతన్య, మంజిమా మోహన్,  సంగీతం: రహ్మాన్, నిర్మాత: మిరియాల రవీందర్ రెడ్డి, దర్శకత్వం: గౌతమ్ మీనన్

 ఇతివృత్తం: రొమాంటిక్- యాక్షన్ ఎంటర్‌టైనర్

 హైలైట్స్:  ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.  ఎ.ఆర్. రహ్మాన్ మ్యూజిక్.  ఇదే కథతో తమిళంలో శింబు హీరోగా రూపొందిస్తున్నారు.

 ప్రోగ్రెస్: ఒక పాట మినహా పూర్తి. త్వరలో యూరప్‌లో ఆ పాట చిత్రీకరణ. నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 బడ్జెట్: సుమారు రూ. 25 కోట్లు

 రిలీజ్: ఏప్రిల్ ద్వితీయార్ధంలో

 

 రొమాంటిక్ థ్రిల్లర్

 చిత్రం: శ్రీదేవి మూవీస్ చిత్రం. టైటిల్ పెట్టాలి.


 తారాగణం: నాని, సురభి, నివేదా థామస్, అవసరాల శ్రీనివాస్, రోహిణి,  సంగీతం: మణిశర్మ, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

 ఇతివృత్తం: సిటీ నేపథ్యంలో, ధనిక వ్యాపార ఫ్యామిలీల మధ్య సాగే  రొమాంటిక్ థ్రిల్లర్

 హైలైట్స్:  ఇటీవల వస్తున్న కొత్త తరహా చిత్రాల ఫక్కీలోది.  కథా పరంగా, టెక్ని కల్‌గా ఉన్నత ప్రమాణాలు  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలం   వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్, కథకు తగ్గ యాక్షన్, ఛేజ్‌లతో అన్ని ఉంటూ, అన్ని వర్గాలకూ నచ్చే చిత్రం  పాటలు, డ్యాన్స్‌లకే పరిమితం కాని ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరితోనూ మంచి రొమాన్స్.   రీరికార్డింగ్‌కున్న మంచి అవకాశానికి తగ్గట్లు మణిశర్మ అందిస్తున్న కొత్త తరహా సంగీతం.   ఎస్. రవీందర్ (ఆర్ట్), పి.జి. విందా (సినిమాటోగ్రఫీ) లాంటి పేరున్న టెక్నీషియన్ల పనితనం

 ప్రోగ్రెస్: 75 శాతం పూర్తి. ఇటీవలే కొడెకైనాల్‌లో భారీ షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ మొదటి వారానికి చిత్రీకరణ పూర్తి

 బడ్జెట్: సుమారు రూ. 15 కోట్లు

 రిలీజ్: మే చివరి వారంలో!

 

 వేసవికి కూల్‌ఫిల్మ్

 చిత్రం: ‘అ...ఆ...’


 తారాగణం: నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, నదియా, సీనియర్ నరేశ్, సంగీతం: మిక్కీ జె. మేయర్, నిర్మాత: చినబాబు), రచన - దర్శకత్వం: త్రివిక్రమ్

 ఇతివృత్తం: ఒక హీరో, ఇద్దరు హీరోయిన్ల లవ్‌స్టోరీ. కానీ, ముక్కోణపు ప్రేమ కాదు.  అనసూయా రామలింగంగా సమంత, ఆనంద్ విహారిగా నితిన్‌ల రొమాంటిక్ - కామెడీ. కుటుంబ బంధాలకు పెద్ద పీట!

 హైలైట్స్:  ఆహ్లాదపరుస్తూనే ఆలోచింప జేసే త్రివిక్రమ్ మార్కు సన్నివేశాలు, సంభాషణలు.  ఒక మామూలు కథను ఎలాంటి జిమ్మిక్కులూ లేకుండా, ఎంత నిజాయతీగా చెప్పవచ్చో అంత నిజాయతీగా చెప్పిన, నిఖార్సైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.  కెమేరామన్ నటరాజ్ సుబ్రమణియన్ ‘ఫ్లై కామ్’ను విస్తృతంగా వినియోగించారు.

 ప్రోగ్రెస్: పొల్లాచ్చిలో ఆమధ్య చేసిన 10 రోజుల షెడ్యూల్‌తో టాకీ పూర్తి. ప్రస్తుతం  ప్యాచ్‌వర్క్ చేస్తున్నారు. వేగంగా పోస్ట్ ప్రొడక్షన్. మార్చి 24 నుంచి 2 పాటలు తీస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆడియో రిలీజ్.

 బడ్జెట్: సుమారు రూ. 40 కోట్లు

 రిలీజ్: మే 6న.

 

 సైన్స్ ప్లస్ ఫిక్షన్

 చిత్రం: ‘24’


 తారాగణం: సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్, సంగీతం: ఎ.ఆర్. రహ్మాన్, నిర్మా తలు: శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ సినిమాస్, దర్శకత్వం: విక్రమ్ కుమార్

 ఇతివృత్తం: సైన్స్ - ఫిక్షన్ థ్రిల్లర్. టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే కథ. 24 అంకె చుట్టూ కథ సాగుతుంది. ఆరేళ్ళ క్రితమే విక్రమ్ హీరోగా తెర మీదకు రావాల్సింది. తర్వాత మహేశ్ వద్దకూ ఈ స్క్రిప్ట్ వచ్చింది. భారీ బడ్జెట్, సాంకేతిక కారణాల వల్ల ఆగి, ఇప్పుడు సూర్య హీరోగా వస్తోంది.  

 హైలైట్స్:  సూర్య విచిత్ర వేషధారణ. హీరోగా, విలన్‌గా 2 పాత్రలూ చేస్తున్నారు. ఎన్ని గెటప్స్‌లో ఎలా కనిపిస్తారని సస్పె న్స్  విలన్ పాత్రకి 4 గంటలు మేకప్, కాన్సెప్ట్, టైమ్ మిషన్ నేపథ్యం  చెన్నైలోనే కాక ముంబయ్, గుర్గావ్, పుణేలతో పాటు పోలెండ్‌లోనూ చిత్రీకరణ. ఖరీదైన అద్భుత లొకేషన్స్‌ను కెమేరాలో బంధించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్ల సాయం.  హీరో నితిన్ దీన్ని తెలుగులో అందిస్తున్నారు.

 ప్రోగ్రెస్: చిత్రీకరణ తుది దశలో ఉంది.   

 బడ్జెట్: సుమారు రూ. 80 కోట్ల పైనే!

 రిలీజ్: తమిళం, తెలుగుల్లో మే నెలలో!

 

 నవ్వులే... నవ్వులు

 చిత్రం: అధికారికంగా ప్రకటించలేదు.


 తారాగణం: మంచు విష్ణు, రాజ్‌తరుణ్, సోనారిక, హెబ్బాపటేల్, రాజేంద్రప్రసాద్, పోసాని, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: అనిల్ సుంకర,  స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి

 ఇతివృత్తం: సమకాలీన యువతుల స్వభావాన్ని చూపెడుతూనే, ఒక చిన్న సందేశాన్ని పూర్తి కామెడీతో చెప్పే ఎంటర్‌టైనర్.

 హైలైట్స్:  కథాంశంలో ఒక చిన్న పెయిన్‌ఫుల్ అంశం ఉన్నా, పంచదార పూతతో చెప్పే కథనం.   సినిమా మొత్తానికీ కామెడీయే పెద్ద హైలైట్. పాత్రల పరిచయమై పోయాక, రెండో రీల్ నుంచి చివరి రీలు దాకా హిలేరియస్ కామెడీగా నడుస్తుందని దర్శక, నిర్మాతల ఉవాచ  ప్రత్యర్థి పాత్రల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ, హీరోలు నడిపే డ్రామా  బ్యాంకాక్‌లో, హైదరాబాద్‌లో సెట్స్‌లో పాటల చిత్రీకరణ.

 ప్రోగ్రెస్: పాటలతో సహా షూటింగ్, ఎడిటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఏప్రిల్ ఫస్ట్ కల్లా తొలి కాపీ రెడీ.

 బడ్జెట్: సుమారు రూ. 13 కోట్లు.

 రిలీజ్: ఏప్రిల్ 14న.

 

 సుప్రీమ్ యాక్షన్

 చిత్రం: ‘సుప్రీమ్’


 తారాగణం: సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా, రాజేంద్రప్రసాద్, రవికిషన్, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: ‘దిల్’ రాజు, దర్శకత్వం: అనిల్ రావిపూడి

 ఇతివృత్తం: హీరో ట్యాక్సీ డ్రైవర్, హీరోయిన్ పోలీస్ ఇన్‌స్పెక్టరైన ఈ చిత్రకథ పూర్తి వినోదాత్మకం. ‘సుప్రీమ్’ అనే పేరు కూడా కథలో భాగమే. తొలి రీల్‌లోనే ఆ సంగతి వెల్లడి.

 హైలైట్స్:  సమ్మర్ సీజన్‌కి అవసరమైన పూర్తి వినోదంతో పాటు థ్రిల్ చేసే యాక్షన్‌తో సౌతిండియన్ మీల్స్ లాంటి సినిమా  వినోదం నిండిన విలన్‌గా భోజ్‌పురీ హీరో రవికిషన్  ‘యముడికి మొగుడు’లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ‘అందం హిందోళం అధరం తాంబూలం...’ను రీమిక్స్ చేశారు.  ఎలాంటి వల్గారిటీ లేకుండా కుటుంబమంతా చూడదగ్గ చిత్రం

 ప్రోగ్రెస్: నాలుగైదు రోజుల షూటింగ్ మినహా మిగతా సినిమా పూర్తి.

 బడ్జెట్: సుమారు రూ. 15 కోట్లు. అభిషేక్ పిక్చర్స్ వారు రూ. 20 కోట్ల పైగా మొత్త మిచ్చి,ఈ చిత్రం హక్కులన్నీ కొనుగోలు

     చేసినట్లు సమాచారం.

    రిలీజ్: ఏప్రిల్ 29న అని ప్లాన్.

 

 ఇది... 600 కోట్ల జూదం!

 ఈసారి వేసవికి బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలు, ప్రభాస్, చిన్న ఎన్టీయార్, రామ్‌చరణ్, గోపీచంద్, రామ్, కల్యాణరామ్ లాంటి యువ హీరోలు హాళ్లలో పలకరించడం లేదు. తరువాతి సీజన్లలో జనం ముందుకు రావడానికి షూటింగ్స్‌లో బిజీగా గడపనున్నారు. అయితే, సందీప్ కిషన్ (‘రన్’), నారా రోహిత్ (‘సావిత్రి’, ‘రాజా చెయ్యి వేస్తే’), మంచు మనోజ్ (‘ఎటాక్’), సుమంత్ అశ్విన్ (‘రైట్ రైట్’) లాంటి యువ హీరోలు మాత్రం బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ వేసవి సినీ సమరంలో మరింత వేడిమికి తోడవుతున్నారు. వెరసి, ఈ వేసవిలో చెప్పుకోదగ్గ హీరోలు అందరివీ కలిపి పాతిక సినిమాల దాకా రానున్నాయి. ఈ మార్చి ఆఖరు నుంచి రాగల 75 రోజుల్లో 25 సినిమాలు రిలీజ్... అంటే, సగటున ప్రతి మూడు రోజులకో కొత్త సినిమా! వీటిపై రూ.600 కోట్ల దాకా పెట్టుబడి పణంగా పెట్టారు. అందుకే, ఈ సమ్మర్ చాలా హాట్ గురూ!

 

 - రెంటాల జయదేవ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top