సుల్తాన్కు కళ్లు తిరిగే కలెక్షన్లు

సుల్తాన్కు కళ్లు తిరిగే కలెక్షన్లు


ఇనుప నరాలు, ఉక్కు పిడికిళ్లతో గోదాలో ప్రత్యర్థులను చిత్తు చేసిన బాలీవుడ్ సుల్తాన్.. అవలీలగా రూ. 300 కోట్ల మార్కు దాటేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు మొత్తం కలిపితే దాదాపు రూ. 345 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఈద్ సెంటిమెంటుతో జూలై 7వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా భారతదేశంలో రూ. 252.5 కోట్లు, విదేశాల్లో రూ. 92 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటివరకు మొదటి వారంలో ఏ బాలీవుడ్ సినిమా సాధించనంత మొత్తంలో కలెక్షన్లు సాధించింది. హీరోతో పాటు హీరోయిన్ అనుష్కా శర్మ కూడా రెజ్లర్ పాత్ర పోషించిన ఈ సినిమా దుబాయ్, పాకిస్థాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి చాలా దేశాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆయా దేశాల్లో ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకూ రానంత స్థాయిలో కలెక్షన్లు దీనికి వచ్చాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top