నరరూప రాక్షసులు

stuartpuram release in may - Sakshi

‘గూఢచారి’ ఫేమ్‌ ప్రీతిసింగ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘స్టూవర్టుపురం’. రంజిత్‌ కోడిప్యాక సమర్పణలో అర్కాన్‌ ఎంటరై్టన్‌మెంట్స్‌ పతాకంపై సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ– ‘‘నరరూప రాక్షసుల్లాంటి స్టూవర్టుపురం గ్యాంగ్‌ హీరోయిన్‌ ఇంట్లోకి చొరబడతారు. వారిని ఆమె ఎలా ఎదుర్కొందన్న పాయింట్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా నిర్మించాం. రీ–రికార్డింగ్‌కు మంచి స్కోప్‌ ఉన్న ఈ చిత్రానికి నవనీత్‌ చారి కాంప్రమైజ్‌ కాకుండా అందిస్తున్నారు’’ అన్నారు. ‘‘గతంలో మా బ్యానర్‌లో నిర్మించిన ‘నందికొండ వాగుల్లోన, మోని’ చిత్రాలను సత్యనారాయణ ఏకారి బాగా తీశాడు. ఆ రెండు చిత్రాలకంటే ‘స్టూవర్టుపురం’ ఇంకా బాగుంటుంది. మేలో సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు రంజిత్‌ కోడిప్యాక. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్‌: లక్కీ ఏకరీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top