రాణి సంఘమిత్ర

రాణి సంఘమిత్ర


చూడండి... శ్రుతీహాసన్‌లో రెండోవైపును చూడండి! ఇదైతే... జస్ట్‌ లుక్కే. కానీ, కత్తితో శ్రుతి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందోననే ఊహే ప్రేక్షకులకు కిక్‌ ఇస్తోంది. ఇప్పటివరకు అయితే... స్వీట్‌ అండ్‌ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్‌ అండ్‌ బబ్లీ హీరోయిన్‌గా ఎక్కువ శాతం సినిమాల్లో నటించారు శ్రుతి. వారియర్‌ ప్రిన్సెస్‌గా ‘సంఘమిత్ర’లో ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ రోల్‌లో కనిపించనున్నారు. తమిళ దర్శకుడు సుందర్‌ .సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రుతి ఫస్ట్‌ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదల చేశారు.తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’, తమిళంలో ‘పులి’.. శ్రుతి రెండు సోషియో ఫాంటసీ ఫిల్మ్స్‌ చేశారు. రెండిటిలోనూ ఆమెకు యుద్ధాలు చేసే ఛాన్స్‌ రాలేదు. ఈ ‘సంఘమిత్ర’లో ఆమె టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు. లుక్‌ ఎలా ఉందో చూశారుగా? శత్రువుల లెక్కలు సరిచేయడంలో శ్రుతి ఏమాత్రం ఛాన్స్‌ తీసుకోరని అర్థమవుతోంది కదూ! ఈ సినిమా కోసం లండన్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఇతర యుద్ధ విద్యల్లో శ్రుతి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. శ్రుతితో పాటు ఇందులో హీరోగా నటిస్తున్న ఆర్య లుక్‌ను కూడా కేన్స్‌లో విడుదల చేశారు.

Back to Top