అభిమానంతో.. ఇట్లు శ్రీదేవి స్కూల్‌

Sridevi's Films And Dance Style Are On This School's Syllabus - Sakshi

అందాల తారల పేరు మీద గుడి కట్టడం మనకు తెలుసు. అదే ఆ అభిమానికి హోటల్‌ ఉంటే ‘ఖుష్బూ ఇడ్లీ’ అంటూ మెనూ అందిస్తాడు. ఇది ఖుష్బూ కథ. శ్రీదేవి విషయానికి వస్తే.. ఆమె అభిమాని ఏకంగా స్కూల్‌ పెట్టాడు. నర్సరీ టు ప్లస్‌ టూ స్కూల్‌ కాదిది. నటనలో అఆలు నేర్పించే స్కూల్‌. ఈ స్కూల్‌కి శ్రీదేవి పేరునే పెట్టారు. అభిమాని ఇష్టంగా పేరు పెట్టుకుంటానంటే శ్రీదేవి కాదంటారా ‘ఊ’ అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఇంతకీ ఈ స్కూల్లో ఏమేం నేర్పిస్తారంటే.. యాక్టింగ్, డ్యాన్స్‌ వంటివన్నీ నేర్పిస్తారు. ఈ స్కూల్‌ త్వరలో శ్రీదేవి చేతుల మీదగా ఆరంభం కానుంది.

‘‘మిగతా యాక్టింగ్‌ స్కూల్‌ వాళ్ళతో కూడా చర్చించి కామన్‌ సిలబస్‌ను గురించి ప్రయత్నిస్తాం. వచ్చే సంవత్సరంలో మెదట్లో ప్రారంభం కానున్న ఈ స్కూల్‌ బ్రాంచీలు  హైదరాబాద్, ముంబై , డిల్లీలో ఉంటాయి’’ అన్నారు శ్రీదేవి అభిమాని, స్కూల్‌ అధినేత అవినాష్‌ నాయర్‌. అంతా బాగానే ఉంది.. ప్రారంభోత్సం నాడు శ్రీదేవి పాఠాలు చెబుతారట. గౌరవ లెక్చర్‌ ఇవ్వనున్నారు. ‘‘ఈ స్కూల్‌తో నాకు అంతగా సంబంధం లేకపోయినా నా అభిమానులు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రీదేవి. ఇంతకీ పాఠాలు చెప్పడానికి హైదరాబాద్‌ వస్తారా? ముంబైలోనా? ఢిల్లీ వెళతారా? ఏ ప్రారంభోత్సవంలో శ్రీదేవి పాల్గొంటారనేది త్వరలో తెలుస్తుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top