‘సైరా’ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌

Skyfall Stunt Master For Sye Raa Narasimha Reddy - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న  ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. మెగాస్టార్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది.

భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ సీన్స్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు పని చేస్తున్నారు. స్కైఫాల్‌, హ్యారీపొటర్‌ సిరీస్‌లకు యాక్షన్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గ్రెగ్‌ పావెల్‌ సైరా సినిమాకు ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ గ్రెగ్‌ పావెల్‌ల ఫొటోను ట్వీట్‌ చేసిన బ్రహ్మాజీ సైరా మూమెంట్‌, యాక్షన్‌ బిగిన్స్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top