అప్పడు నేను చాలా భయపడ్డాను: శ్రుతీహాసన్‌

Shruti Hassan Singing For Asha Bhosle Childhood Pic Shared On Social Media - Sakshi

నటి శ్రుతీహాసన్‌... స్టార్‌ హీరో కూతురిగా కంటే సొంత టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా విభిన్న కోణాలతో తన అభిమానులను మెప్పిస్తూన్నారు శ్రుతీ. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చిన్ననాటి ఫొటోను అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లోని శ్రుతీ ఫ్యాన్స్‌ క్లబ్‌ పేజీలో మంగళవారం షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఆమెతో పాటు సుప్రసిద్ధ గాయని  ఆశా భోంస్లే కూడా ఉన్నారు. యూనిఫాంతో ఉన్న చిన్నారి శ్రుతీ.. గాయని ఆశా భోంస్లే ముందు పాట పాడుతూ కనిపించారు. ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోం‍ది. దీంతో ఇది చూసిన శ్రుతీ.. ‘ఈ ఫొటో అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు నేను ఈ లెజెండరి గాయని ముందు పాడటానికి చాలా భయపడ్డాను. ఇది నాకు ఓ అందమైన జ్జాపకం. ఫొటోను షేర్‌ చేసి.. నన్ను గత జ్ఞాపకంలోకి తీసుకెళ్లినా మీకు ధన్యవాదాలు’ అంటూ కామెంట్‌ చేశారు. (అవును.. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా!)

‘అందుకే స్మృతి గెలిచింది’

కాగా.. శ్రుతీ ఆరేళ్ల వయసులోనే తన తండ్రి.. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ నటించిన సినిమాలలో పాట పాడి చైల్డ్‌ సిగర్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయయ్యారు. కమల్‌హాసన్‌ నటించిన ‘తేవర్‌ మగన్‌’ చిత్రంలో ‘పోత్రి పాదాడి పన్నె’ అనే పాట పాడారు. ఆ తర్వాత తన తండ్రి నటించిన ‘చాచి 420’లో ‘చుపాది, చుపాడి చాచి’ ‘హే రామ్‌’ సినిమాలో  ‘రామ్‌ రామ్‌ హే రామ్‌’, ‘ఉన్నిపోల్‌ ఒరువన్‌’లో ‘వనం ఎల్లైల’ వంటి పాటలు పాడారు. తను పాడిన ఆ పాటలలో కొన్నింటినీ తనే స్వయంగా కంపోజ్‌ చేశారు కూడా. అలా తమిళ, బాలీవుడ్ చిత్రాలలో కూడా పాటలు పాడి సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక  2009లో వచ్చిన హిందీ చిత్రం ‘లక్‌’లో నటించి.. నటిగా మారారు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’లో హీరోయన్‌ నటించిన శ్రుతీకి అంతగా గుర్తింపు రాలేదు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరసన ‘గబ్బర్‌ సింగ్‌’లో నటించిన ఆమె మొదటిసారి సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత బలుపు, రేస్‌ గుర్రంలో నటించి స్టార్ హీరోయిన్‌ల సరసన చేరిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top