రవితేజతో ఆడిపాడనున్న శ్రుతి హాసన్‌

Shruti Haasan To Play Role In Ravi Teja Movie - Sakshi

చెన్నై : ఏ విషయానైనా కుండ బద్ధలు కొట్టేటట్టు మాట్లేడే నటి రు శ్రుతి హాసన్‌ . నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తించే ఈ సంచలన నటి హిందిలో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత  తెలుగు, తమిళం భాషల్లో హీరోయిన్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు భాషల్లో శ్రుతీహాసన్‌కు ఎక్కువ హిట్స్‌ ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమనే. అంతే కాదు ఈ మధ్య ప్రేమ,  మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అంటూ సినిమాలకు కాస్త దూరం అయిన ఈ బ్యూటీ ప్రియుడు మైఖెల్‌ కార్చోల్‌ నుంచి దూరం అయిన తరువాత నటనపై దృష్టి సారించాలన్న నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ అవకాశాలు కల్పించిందీ తెలుగు సినిమానే. హిరో రవితేజ సరసన ఒక చిత్రం చేయనుంది.

కాగా ప్రస్తుతం తమిళంలో విజయ్‌సేతుపతితో లాభం అనే చిత్రంలో నటిస్తోంది. అయితే అభిమానులతో ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తరుచూ టచ్‌లో ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్‌ ఒకరు. తన జీవితంలో రెండో మజిలీని ప్రారంభించాను అని తనే స్వయంగా పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాదు హాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. అక్కడ ఒక వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సిద్ధం అయ్యింది. దీంతో ఇటీవల శ్రుతీహాసన్‌ అభిమానులతో ఆన్‌లైన్‌లో చాట్‌ చేశారు. పలు విషయాలను వారితో షేర్‌ చేసుకున్నారు. అలా పెళ్లెప్పుడు చేసుకుంటారు? మమ్మల్ని ఆహ్వానిస్తారా? ఒక అభిమాని అడగ్గా అందుకు శ్రుతీహాసన్‌ చాలా ప్రశాంతంగా తన పెళ్లి కోసం మీరు చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుందనీ, అంతకంటే ముందు తన పుట్టిన రోజు వేడుకకు రండి కలిసి ఆనందంగా జరుపుకుందా! అని బదులిచ్చి అతన్ని కూల్‌ చేసింది. ఎంతైనా కమలహాసన్‌ కూతురు కదా! ఆ మాత్రం మాటల చాతుర్యం ఉంటుంది మరి. కాగా ఇటీవల ఫొటో సెషన్‌ చేయించుకుని హాట్‌ హాట్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు వెబ్‌సైట్లలో వైరల్‌ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top