పెళ్లా? ఇప్పడే కాదు!

Shruti Haasan Opens Up About Her Marriage - Sakshi

చెన్నై : తన పెళ్లి ఇప్పుడే కాదని, మరికొన్ని రోజులవుతుందని హీరోయిన్‌ శృతిహాసన్‌ వెల్లడించారు. బాయ్‌ఫ్రెండ్‌ మైకేల్‌ కోర్సేల్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ వచ్చిన శృతిహాసన్‌ హఠాత్తుగా బ్రేక్‌అప్‌ చెప్పేసి ప్రేమను తెగదెంపులు చేసుకుంది. ఓ వైపు ఇది ఆమె మనసును గాయపరిచినా మరో వైపు లాభకరంగా మారింది. ఒకటిన్నర ఏడాదికి పైగా నటించకుండా ఉన్న ఆమె ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తున్నారు. శృతిహాసన్‌ తన ప్రేమను కాదన్నా ఆమె అభిమానులు ఆమెను విడిచిపెట్టడం లేదు. ఒక అభిమాని ట్విట్టర్‌లో ఆమె పెళ్లి విషయం ప్రస్తావించారు. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? చెబితే అభిమానులమైన తామంతా పాల్గొంటామని అడగ్గా, ఆమె నా వివాహానికి మీరు చాలా రోజులు వేచిచూడాలని అన్నారు. అంతేకాకుండా తన బర్త్‌డేను ఒకటిగా జరుపుకుందాం రండి! అని బదులిచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top