‘సాహో’ కన్నా ముందే తెలుగులో..!

Shraddha Kapoor - Sakshi

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమయిన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యూల్‌లను ఫైనల్‌ చేశారన్న టాక్‌ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా నటింపచేసే ఆలోచనలో ఉన్నారు. శ్రద్ధా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తే సాహో కన్నా ముందు ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను మదు బాబు నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top